అంగన్వాడీ వర్కర్స్ సమస్యల ను పరిష్కరించాలి
1 min readసమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరపాలి…..సీఐటీయూ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : గత 17 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె నేపథ్యంలో వెంటనే అంగన్వాడీ వర్కర్స్ ను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి సమస్యలపై ను పరిష్కరించాలని సిఐటియు మండల కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. గురువారం నాడు సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి జ్యోతిలక్ష్మి అధ్యక్షతన తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఐసిడిఎస్ విభాగంలో మహిళలు శిశు సంరక్షణ, అదేవిధంగా పోషకాహార పంపిణీ గర్భవతులు బాలింతల పట్ల అత్యంత ప్రాధాన్యతగల సేవలందించేటటువంటి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆవేేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో మన ప్రభుత్వం వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పినటువంటి హామీని మర్చిపోయి వాళ్ళ పార్టీ నాయకులతో అంగన్వాడీ వర్కర్స్ ను దుర్భాషలాడిస్తున్నాడని మండిపడ్డారు. మహిళలను కించపరిచిన అవమానపరిచిన ఎవరు బాగుపడరని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనాలు, పింఛన్ సౌకర్యము, సంక్షేమ పథకాలు వర్తింపు అదేవిధంగా ప్రమోషన్లు వంటి చాలా చిన్న డిమాండ్లు ప్రభుత్వం మీద అంగన్వాడి వర్కర్స్ పెట్టారని తెలిపారు. కానీ అంగన్వాడీ వర్కర్స్ మీద ప్రభుత్వం మోసంం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ ఎర్రమ్మ, హుస్సేన్మ్మ ,మమత, జానకి సరోజ,వెంకటలక్ష్మి, మంగమ్మ ,లక్ష్మి భార్గవి మాభూన్ని తదితరులు పాల్గొన్నారు.