PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

1 min read

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి రామచంద్రయ్య                         

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ: ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైనసిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య  భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. రహమాన్ . మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు1996 సంక్షేమ చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో 2006 సంవత్సరంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడమైనది అని అన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రతి కార్మికుడికి  రాష్ట్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. 2014నుండి2019వరకుగత టిడిపి ప్రభుత్వ హాయంలో కార్మికులకి అందాల్సిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలేదని అన్నారు. ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పేదలకు, కార్మికులకు, కర్షకులకు అండగా ఉంటానని చెప్పి, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత భవన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం లేదన్నారు. కార్మికులసంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకి అందాల్సిన సంక్షేమ పథకాలు కోసం చాలా మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయినప్పటికీ  ఇంత వరకు కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని ఆవేదన చెందారు.

About Author