ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
1 min read
ఏపీ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ని కలిసిన జేఏసీ నాయకులు
మెమొరండం,ఎన్జీవోస్ డైరీ అందజాత
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వెలగపూడి సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ని కలిశారు.జె ఏ సి నాయకత్వంతో కల్సి మెమోరాండం ఇచ్చి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఇరిగేషన్ ఎన్జీవోస్ డైరీ ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్అందజేసారు. రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జీవోస్ జె ఏ సి నాయకులు ఆర్ ఎస్ హరనాధ్, జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు. తదితరులు పాల్గొన్నారు.