PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

1 min read

– గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ డిమాండ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  గ్రామ వార్డ్ సచివాలయం నందు పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అర్లయ్య మరియు APJAC అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షులు వి.గిరికుమార్ రెడ్డి  డిమాండ్ చేశారు. శనివారం కర్నూల్ నగరంలోని రెవెన్యూ భవన్ నందు ఆ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సచివాల వ్యవస్థ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగుల యొక్క సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయిందని వారన్నారు. అనేకసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం నోచుకోవడం లేదని వారు విమర్శించారు. మొదట విడత గ్రామ వార్డు సచివాలయు ఉద్యోగులు కోల్పోయిన 9 నెలలు  మరియు రెండవ విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోల్పోయిన 5 నెలల కి సంబంధించిన ఆర్థికపరమైన మరియు సర్వీస్ పరమైన అంశాల పైన ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.వార్డ్ శానిటేషన్ సెక్రటరీ యొక్క సమస్యలను పరిష్కరించి మేస్త్రీ డ్యూటీ నుండి విముక్తి కలిగించి వారికి మిగిలిన సచివాలయ ఉద్యోగుల మాదిరి ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు  వర్తింపజేయాలని కోరడం జరిగింది.వార్డు అడ్మిన్ సెక్రటరీస్ కి ఫుల్ ఛార్జ్ ఇచ్చి వారి యొక్క బాధ్యతలను సరైన రీతిలో వినియోగించుకోవాలి క్రమబద్ధీకరణకు నోచుకోని మిగిలిపోయిన వీఆర్వోస్ ను వెంటనే క్రమబద్ధీకరించాలి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క ప్రమోషన్ ఛానల్లో త్వరితగతిన రూపొందించాలి ఎనర్జీ అసిస్టెంట్లు యొక్క నియామకం గ్రామ వార్డు సచివాలయాల శాఖ ద్వారా జరిగింది కానీ వారి విధులు డిస్కముల ద్వారా అందిస్తు గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 135 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు 200 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు, కనుక వారికి  సచివాలయ పరిధిలోనే విధులకు హాజరయ్యే విధంగా మరియు వారి జీతభత్యాలు కూడా సచివాలయ DDO అధికారి ద్వారా 010 పద్దు ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. పంచాయతీలు నుండి మున్సిపాలిటీలోని విలీనమైనటువంటి సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ అదే విధంగా సర్వీస్ రూల్స్ ను ఫ్రేమ్ చేయవలసిందిగా కొరటమైనది.ANM, VAA, VHA, VSA వారికి ఇంకను ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొదలు కానందున వారు కుటుంబాలకు దూరంగా ఉంటూ అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కనుక వెంటనే వారికి బదిలీల ప్రక్రియ మొదలుపెట్టాలి. అదేవిధంగా అన్ని కేటగిరికి సంబంధించిన సీనియార్టీ లిస్టు వెంటనే ప్రకటించాలి.రీ సర్వే లో గ్రామ సర్వేయర్లు తీవ్ర పని ఒత్తిడి వల్ల పలు గ్రామ సర్వేయర్లు విధి నిర్వహణలోనే తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది అని, పని వేళల్లో మాత్రమే పని చేయించి, వారాంతపు రోజుల్లో టార్గెట్లు పేరుతో సిబ్బందిని ఒత్తిడి చేయరాదని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ సర్వేయర్ల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని కోరడం జరిగింది.4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు APGLIs బాండ్లు  విడుదల చేయలేదు, వెంటనే APGLI బాండ్లు జారీ చేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి మెడికల్ రీింబర్స్మెంట్ సదుపాయం కల్పించాలని కోరడం అయినది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రాన్ అకౌంట్లో సిపిఎస్ అమౌంట్  జమ చేయాలి.  గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలను వర్తింపజేయాలి. CLs ని, ELs ని, హాఫ్ పే లీవ్ మొదలగు లీవులును వెంటనే సచివాలయ ఉద్యోగుల HRMS login లో వెంటనే జమ చేయాలని కోరడం జరిగింది.ఈ సమావేశానికి  కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన అధ్యక్షులు శ్రీ వి గిరి కుమార్ రెడ్డి ,  జనరల్ సెక్రెటరీ శ్రీ కేవై కృష్ణ ,  AP GW SEWO రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ డి చౌడప్ప , జిల్లా నాయకులు  తదితరులు పాల్గొన్నారు..      ఈ కార్యక్రమం అనంతరం నూతన కర్నూల్ జిల్లా కరవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.

About Author