PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు  మండల కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారుసిఐటియు జిల్లా కమిటీ పిలుపు మేరకు సోమవారం దేవనకొండ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ దగ్గర స్వచ్ఛభారత్ కార్మికుల సంఘం మండల  నాయకులు శాంతిరాజు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని,స్వచ్ఛభారత్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించారని, ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి గ్రామాల్లో పరిశుభ్రత ద్యేయంగా స్వచ్ఛభారత్ కార్మికులు పనిచేస్తున్నారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారని, వారి ఆరోగ్యం దెబ్బ తింటున్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా నిరంతరం మురికి వాడల్లో చెత్త కుప్పల్లో బ్రతుకుతూ పనిచేస్తున్నారని, అలాంటి వారి బతుకులు వెలుగు నింపాల్సిన ప్రభుత్వాలు చిత్తశుద్ధిలేకుండానిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటిదాకా 20 నుండి 25 నెలల వేతనాలు పెండింగ్లోఉన్నాయని, వారికి రక్షణ కోసం ఇవ్వాల్సిన గ్లౌజులు,మాస్కులు శానిటైజర్ కూడా ఇవ్వడం లేదని, ఇలాంటి పరిస్థితులలో కూడా పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులపై రాజకీయ నాయకులకు కూడా ఏమాత్రం ప్రేమలోదని వారిని రాజకీయంగా వేధిస్తున్నారని, పంచాయతీలో నిధులు లేవనే కారణంతో అక్రమంగా తొలగిస్తున్నారని వారిని స్వచ్ఛభారత్ కార్మికుల గుర్తించి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారికి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలి.

About Author