ఉపాద్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
1 min read– ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఉపాద్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న ఐదు డిఎ మరియు ఆరియర్స్ ను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిటిఎఫ్ నాయకులు గాదె రోషన్న తెలిపారు .శుక్రవారం పట్టణంలోని స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టి ఎ ఆర్ ఎల్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు .భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల కండువాలు మరియు ప్లే కార్డు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి ఎ అరియర్స్ చెల్లింపు ,నూతన డి ఎ విడుదల ,సిపిఎస్ రద్దు పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటలు ,వాగ్దానాలు,హామీలను విస్మరించడం తగదని విమర్శించారు .ప్రభుత్వ మొండి వైఖరి ,నిర్లక్ష్యం కారణంగాఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర సంతృప్తిలో ఉన్నారన్నారు .జిపిఎఫ్ బీమా బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు .ప్రతి ఏడాది ఇచ్చే సరెండర్ సెలవులు తక్షణమే చెల్లించాలని ,వైద్యం పిల్లల చదువులు పెళ్లి ఖర్చు నిమిత్తం రుణ మంజూరు విషయంలో తీవ్రం జాప్యం లేకుండా తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆరోగ్య కార్డు విషయంలో ఇబ్బందులను తొలగించాలన్నారు .ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అజయ్ కుమార్ ,ఎస్ టి యు నారాయణస్వామి ,పి ఆర్ టి యు మల్లికార్జున రెడ్డి ,ఏపీ టి టి ఏ రాజ సాగర్ తదితరులు పాల్గొన్నారు.