15 నాటికి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
1 min read– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫిబ్రవరి 15 వ తేది నాటికి పెండింగ్ లో ఉన్న ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రెవిన్యూ అంశాలపై సబ్ కలెక్టర్,రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి 95 వేల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని అందులో ప్లాట్ నంబర్లు లేని లబ్ధిదారులు 16,554 ఉండగా 16,400 మ్యాప్ చేయలేనివి తీసివేస్తే మిగిలిన వాటికి మ్యాపింగ్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేసే పనుల్లో ఉన్నాయన్నారు.. మ్యాపింగ్ చేయాల్సిన వాటిలో కూడా ఇంకా 1000 ప్రదేశాలలో పెండింగ్ లో ఉన్నాయని అందులో 793 ప్లాట్స్ కు బౌండరీ లు లేనివి , ప్లాట్ నంబర్లతో ఉన్న అర్హులైన లబ్ధిదారులలో 154 మ్యాపింగ్ చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.. అందులో కర్నూలు డివిజన్లో 342, ఆదోని డివిజన్ లో 347 ఉన్నాయని వాటిలో పురోగతి తీసుకొని రావాలని సంబంధిత డివిజనల్ అధికారులను ఆదేశించారు.. 323 సచివాలయాలలో 74,614 రిజిస్ట్రేషన్ డేటా పోర్ట్ అయ్యిందని, అందులో 306 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, 17 సచివాలయాలలో పెండింగ్ లో ఉందన్నారు.. ఇప్పటివరకు 19 వేల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని, ఇంకా 55 వేలు పెండింగ్ లో ఉన్నాయని, విఆర్ఓ లు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 15 వ తేది నాటికి పూర్తి చేయాలని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రిజిస్ట్రేషన్ డిడ్స్ త్వరలో పంపిణీ చేయనున్నారని తెలిపారు. సివిల్ సప్లైస్ కి సంబంధించి పిడిఎస్ పంపిణి చేసే సమయంలో కచ్చితంగా తహసిల్దార్లు కూడా తనిఖీ చేయాలని జేసీ ఆదేశించారు. పీడీఎస్ పంపిణీ చేసే సమయంలో ఖచ్చితంగా వాలంటీర్ లు కూడా పాల్గొనే విధంగా చూడాలని ఆ ప్రక్రియను సివిల్ సప్లైస్ డిటి మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహసిల్దార్ లను అదేశించారు.. నిర్దేశించిన సమయలోని పీడీఎస్ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత డివిజనల్ అధికారులను ఆదేశించారు.. డిసిఎమ్ఎస్, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్ శాఖలు కలిసి సివిల్ సప్లైస్ ద్వారా కంది పప్పు,జొన్న సేకరణ కి సంబంధించి పురోగతి తీసుకొని రావాలన్నారు. 6A కేసులకు సంబంధించి ఆదోని, ఆలూరు డివిజన్ లలో పిడిఎస్ రైస్ డైవర్షన్ ఎక్కువ జరుగుతుందని, 6A కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఆబాది సర్వే కి సంబంధించి గార్గేయపురం, బి.తాండ్రపాడు లో గ్రౌండ్ వ్యాలిడేషన్ 2 నెలలు నుండి పూర్తి చేయకపోవడం ఏంటని ఈఓపిఆర్ లను ప్రశ్నించారు?? వచ్చే మండల విసి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.. రీ సర్వే కి సంబంధించి పెండింగ్ లో ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ కి సంబంధించి 368 జర్నలిస్ట్ అప్లికేషన్స్ కి గాను 345 వెరిఫై చేసి పంపడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ లను కూడా త్వరితగతిన వెరిఫై చేసి పంపించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఆర్డీఓ లు శేషి రెడ్డి, రామలక్ష్మి, తహశీల్దార్లు పాల్గొన్నారు.