NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

1 min read

– మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: స్పందన కార్యక్రమంలో ఏవైతే ప్రజా సమస్యలు, వాలంటీర్లు గుర్తించి  సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువస్తారో వాటిని వెంటనే పరిష్కరించాలని మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య, తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్, లు తెలిపారు, సోమవారం వారు చెన్నూరు  గ్రామ సచివాలయం-3 లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి, గ్రామ సచివాలయ సిబ్బంది,  వాలంటీర్లు, మండల అధికారులు హాజరయ్యారు, ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ తాసిల్దార్ లు మాట్లాడుతూ, ప్రజా సమస్యలు ఏవైనా అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే వాటిని వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ మీకు సాధ్యపడని సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు సచివాలయ సిబ్బందికి తెలియజేశారు, ముఖ్యంగా జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సకాలంలో ఆయా సర్టిఫికెట్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా గ్రామస్థా యిలో సమస్యలు ఉంటే జిల్లా స్థాయి వరకు పోకుండా, ఇక్కడే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారు అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, ఏపిఎం గంగాధర్, మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, ఉపాధి హామీ సుధారాణి, అంగన్వాడి సూపర్వైజర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author