PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచానికి మన దేశం అందించిన అరుదైన విద్య కర్ర సాము….

1 min read

– మారిన పరిస్థితుల్లో  ప్రాచీన క్రీడలకు ప్రాధాన్యత లభించడం అభినందనీయం…

– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రపంచానికి మన దేశం అందించిన అరుదైన క్రీడా కర్ర సాము(సిలంబం) అని, అలాంటి క్రీడకు ప్రస్తుతం గుర్తింపు లభించడం అభినందనీయమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రలజీస్ట్  డాక్టర్ శంకర శర్మ అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కర్ర సాము క్రీడా పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ర సాము విద్య క్రీడా సంఘం కార్యదర్శి రాఘవేంద్ర ,గోపి తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆధునిక ఆయుధాలు లేని రోజుల్లోనే కర్ర సాము ద్వారా ప్రత్యర్థులను ఎదుర్కొనే వారని చెప్పారు. ప్రాచీన కాలంలో ఆత్మ రక్షణకు  కర్ర సాము ఎంతో ఉపయోగపడేదని వివరించారు. అలాంటి  క్రీడకు మళ్లీ పూర్వ వైభవం లభించడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్టై  ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. క్రీడల్లో పాల్గొంటే తమ పిల్లలు చదువులో వెనుకబడతారు అనే ఆలోచన నుండి తల్లిదండ్రులు బయటికి రావాలని, తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులో మరింత రాణించే అవకాశం ఉందని వివరించారు. మన దేశం అన్ని రంగాల్లోనూ ముందు ఉందని, క్రీడారంగంలోనూ మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకు భావిభారత పౌరులైన విద్యార్థులు క్రీడల్లో క్రమశిక్షణ అంకిత భావంతో సాధన చేసి జాతీయ అంతర్జాతీయ కారులుగా క్రీడాకారులుగా ఎదగాలని చెప్పారు. ఇందుకు ప్రత్యక్ష  నిదర్శనంగా 18 ఏళ్ల యువకుడైన ప్రగ్యానంద్ అంతర్జాతీయ క్రీడాకారుడైన కార్ల్సన్ తో  పోటీ పడటమే  నిదర్శనం అని చెప్పారు. విద్యార్థులు గెలుపు ఓటములకు అతీతంగా క్రీడల్లో పాల్గొనాలని ఆయన చెప్పారు. గెలుపు ఓటములు ప్రామానికము కాదని, కేవలం క్రీడల్లో పాల్గొన్నమా లేదా అన్నదే ముఖ్యమని ఆయన వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా చక్కటి క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈనెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేస్తారని వివరించారు. కర్నూల్ నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.

About Author