పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను చేయాలి
1 min read
మ్యుటేషన్, ఎఫ్ లైన్ పిటిషన్ లను సక్రమంగా పరిష్కరించాలి
అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు, కర్నూలు: రీ సర్వే ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ మరియు సర్వే సిబ్బందికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద రీ సర్వే ప్రక్రియ జరుగుతోందన్నారు. రీ సర్వే కి సంబంధించిన ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్)ను వీఆర్వో లు, సర్వేయర్ లు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తే పొరపాట్లకు ఆస్కారం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ మరియు సర్వే సిబ్బందికి డివిజన్ స్థాయిలో కూడా శిక్షణ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు.సచివాలయంలో ఉన్న మ్యుటేషన్, ఎఫ్ లైన్ పిటిషన్ లకు సంబంధించి అర్జీదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోందన్నారు.. ఐవిఆర్ఎస్ ద్వారా, సీసీఎల్ ఏ, కలెక్టరేట్ నుండి అర్జీ దారులకు ఫోన్ చేసి మీ సేవ ఫీజ్ కాకుండా అదనంగా డబ్బు చెల్లించారా, రీ సర్వే సమయంలో తహసీల్దార్లు ప్రజలకు నోటీసులు ఇస్తున్నారా?వీఆర్వోలు ఫీల్డ్ కి వచ్చి ఎంక్వైరీ చేశారా? అని ఫీడ్ బ్యాక్ ను సేకరించడం జరుగుతోందన్నారు..ఫీడ్ బ్యాక్ నెగెటివ్ గా ఉందని, ఈ అంశానికి సంబంధించి పొరపాట్లు చేసిన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటున్నామన్నారు.. మ్యుటేషన్, ఎఫ్ లైన్ అర్జీలను ప్రొసీజర్ ప్రకారం సక్రమంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..డబ్బు అడిగినా, నోటీసులు ఇవ్వక పోయినా, ఫీల్డ్ కు వెళ్ళకుండా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ఒక ఆస్తి బదలాయింపు లో ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఈ ప్రక్రియ చేసేటపుడు అధికారులు చాలా జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. యాంత్రికంగా చేయకూడదని, నియమ నిబంధనల ప్రకారం సర్వే ప్రక్రియను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఎఫ్ లైన్ పిటిషన్ లకు సంబంధించి విలేజ్ సర్వేయర్ లు ప్రజలకు నోటీస్ లు ఇవ్వకుండా ఎఫ్ఎమ్బి లో అప్లోడ్ చేయకూడదన్నారు.. ఒకవేళ నోటీసులు ఇచ్చినా రాని పక్షంలో నోటీస్ లు సర్వ్ చేసిన ఫోటో, ఫీల్డ్ కి వెళ్లిన ఫోటో, స్టేట్మెంట్ రికార్డు చేసిన ఫోటోలను వెబ్ ల్యాండ్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్టీవో సందీప్ కుమార్, ఎడి సర్వే మునికన్నన్, అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్వో, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
