పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీ సర్వే ను నిర్వహించాలి
1 min read
రీ సర్వే కు ముందుగా రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలి
గోనెగండ్ల లో రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు, కర్నూలు: పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. శనివారం రీసర్వే పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికయి, రీ సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో రీ సర్వే నిర్వహించేటప్పుడు ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి, తగిన సమయం ఇవ్వాలని, తదుపరి వారి సమక్షంలోనే భూములను సర్వే చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. సర్వే ప్రారంభం లోనూ, సర్వే చేసినపుడు, ఎండింగ్ లో ఫోటోలు తీయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే సమయంలో వీఆర్వో కూడా ఉండాలని, గ్రామ లెక్కల్లో ఏమైనా పొరపాట్లు అక్కడికక్కడే సరి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. అక్కడే ఉన్న రైతులు మునిస్వామి, పొట్ట రవి తో కలెక్టర్ మాట్లాడారు.. రైతులతో మాట్లాడుతూ సర్వే చేయడానికి ముందే మీకు నోటీసులిచ్చారా? మీకు పాస్ పుస్తకాలు ఉన్నాయా? రీ సర్వేలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని కలెక్టర్ ఆరా తీశారు..నోటీసులు ఇచ్చారని ,మా సమక్షం లోనే సర్వే చేస్తున్నారని రైతులు సమాధానం ఇచ్చారు.రీ సర్వే కు సంబంధించిన రికార్డ్స్, సర్వే మ్యాప్ లను, సర్వే నిర్వహిస్తున్న భూములను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సర్వే ఏడి ముని కన్నన్, తహసిల్దార్ కుమారస్వామి, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.