NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారు మద్యం తాగడమే సంక్షోభానికి కారణం !

1 min read

పల్లెవెలుగువెబ్ : పోలండ్ కు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత జరోస్లా కజిన్ స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలండ్ లో మెజారిటీ యువ మహిళలు అతిగా మద్యం సేవించడమే దేశంలో జననాల రేటు తక్కువగా ఉండడానికి కారణమని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు పితృస్వామ్యానికి నిదర్శనంగా పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘25 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో గమనిస్తే.. యువ మహిళలు తమ వయసు వారైన పురుషులతో సమానంగా మద్యాన్ని సేవిస్తున్నారు. అందుకే పిల్లలు కలగడం లేదు’’ అని కజిన్ స్కీ వ్యాఖ్యానించారు.

About Author