అమెరికాలో ఆర్థిక మాంద్యం ?
1 min readపల్లెవెలుగువెబ్ : స‌్టాక్ మార్కెట్లను ఆర్థిక మాంద్యం భయాలు పట్టుకున్నాయి. నలభై ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన ధరలను నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక రుణ రేట్లను 0.75 శాతం పెంచింది. గడిచిన 28 ఏళ్లలో ఇదే అతిపెద్ద పెంపు. మున్ముందు సమీక్షల్లోనూ వడ్డీ రేట్లను అధిక మొత్తంలో పెంచనున్నట్లు యూఎస్ ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడంతోపాటు ఈ ఏడాదికి అమెరికా జీడీపీ వృద్ధి అంచనాను 2.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. వృద్ధి మందగమనంతో పాటు ధరల కట్టడికి ఫెడ్ భారీ ‘వడ్డింపులు వచ్చే ఏడాది అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలకూ విస్తరించవచ్చన్న భయాలతో మదుపర్లు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు.