PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీచైతన్య నారాయణ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన వాటిపై జిల్లా విద్యాశాఖాధికారి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రఫీ డిమాండ్ చేశారు.శుక్రవారం పిడిఎస్ యూ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్ యం డి.రఫీ ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు యు. నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా విద్యాసంవత్సరం పూర్తికాకుండానే,పరీక్షలు జరగకుండానే అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులకు మోసపూరిత మాటలు చెబుతూ వేలకువేలు ఫీజు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.కనీసం అర్ధ సంవత్సరం పూర్తి ప్రారంభం కాలేదని అయినప్పటికీ అడ్మిషన్లు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీద ఒత్తిడి పెంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసుకుని తమ పబ్బం గడుపుకోవడానికి ఆయా విద్యాసంస్థలు ప్రయత్నిస్తుంటే సంబంధిత విద్యార్థి కారులకు యజమానుల నుండి ముడుపులు తీసుకుంటున్నారు. ఆయా విద్యాసంస్థల ఫీజులు దోపిడీ ని కానీ అది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై చర్యలు తీసుకోవాలని వాటి గుర్తింపును రద్దు చెయ్యాలని లేని ఎడల విద్యాసంస్థలు ముందు ఆందోళనలు చేస్తామని విద్యాశాఖాధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ నాయకులు సాయి , క్రాంతి మొదలైనవారు వారు పాల్గొన్నారు.

About Author