పునః ప్రారంభించిన డయల్ యువర్ ఈఓ
1 min readపల్లెవెలుగు , వెబ్ శ్రీశైలం: భక్తుల సలహాలు సూచనల కోసం ఏర్పాటుచేసిన చేసినడయల్ యువర్ ఈఓ కార్యక్రమం గతంలో అనివార్య కారణాలవల్ల నిలుపుదల చేశారు మరల పునః ప్రారంభించారు ఆలయ ఈవో లవన్న ఈ కార్యక్రమ సమయంలోమరోక సమావేశంలో ఉన్న కారణంగా ఈవో లవన్న తరపున అసిస్టెంట్ కమీషనర్ పాల్గొనడం జరిగింది. 12.30 గంటల నుంచి 1.30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించారుపలువురు భక్తులు ఈవో కార్యాలయానికి ఫోన్ ద్వారా ఆయా సూచనలు, సలహాలు అందజేశారు. సున్నిపెంట, నంద్యాల, దోర్నాల, హైదరాబాద్, మార్కాపురం, జూపాడుబంగ్లా తదితర ప్రదేశాల భక్తులు నుంచి భక్తులు ఈ డయల్ ఈఓ కార్యక్రమములో పాల్గొన్నారు.శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం వేళలను మరింతగా పెంచాలని కోరారు. శ్రీశైలం పరిధిలోని హోటల్స్ నందు ధరలపట్టిన ఏర్పాటు చేయాలని సూచించారు. మరో భక్తుడు మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులకు వనభోజనాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు సామాన్యభక్తుల సౌకర్యార్థం పాతాళగంగకు వెళ్ళే రోడ్డుమార్గాన్ని వినియోగంలోకి తెచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.మైకుల ద్వారా నిరంతరం ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రసార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఆన్లైన్ నందు మరిన్ని వసతి గదులను అందుబాటులు ఉంచాలన్నారు. మరో భక్తుడు మాట్లాడుతూ శ్రీశైలప్రభ మాసపత్రికలో 2023 సంవత్సరానికి సంబంధించి క్యాలెండరును ప్రచురించవలసిందిగా కోరడం జరిగింది. మరో భక్తుడు వృద్ధులకు సీనియర్ సిటిజన్ దర్శనం ఏర్పాట్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే వారితో పాటు సహాయకులను కూడా అనుమతిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేశారు భక్తులు.