PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వీఆర్​ఓ’ల జీ.ఓ.658.. విడుదల చేయడం హర్షణీయం

1 min read

– AP వీఆర్​ఓ సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎ.మౌళిబాష

పల్లెవెలుగు వెబ్​:రాష్ట్ర వ్యాప్తంగా VRO లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రామ రెవిన్యూ అధికారుల కారుణ్య నియామకాలకు సంబందించిన GO ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేది: 29-09-22 న జారీ చేసింది. VRO ల సర్వీసు నిబంధనలు సవరణలు చేస్తూ జి.ఓ..నెం.658 ను ముఖ్యమంత్రి .వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం చాలా హర్షనీయమని గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎ.మౌళిబాష సంతోషం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రికి, రెవిన్యూ శాఖ మాత్యులు వారికీ, మరియు రాష్ట్ర ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఒక VRO గ్రేడ్-I&II ఎవరు మరణించినా వారి భార్య/పిల్లలకు/వారిపై ఆధార పడిన వారికి గ్రామ రెవిన్యూ అధికారుల సర్వీసు నిబంధనలు-2008 లో నిబంధనల మేరకు డిగ్రీ అంత కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నా కూడా సంబంధం లేకుండా VRO కన్నా తక్కువ కేడర్ అయిన ఆఫీస్ సబార్డినేట్(అటెండర్), వాచ్ మెన్, మరియు స్వీపర్ పోస్టులు కారుణ్య నియామకం కింద ఇచ్చేవారు. మా గ్రామ రెవిన్యూ అధికారులకు న్యాయం చేయమని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భూపతిరాజు రవీంద్ర రాజు గారు అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించుకోగా వారి అభ్యర్థన మేరకు  ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారు గ్రామ రెవిన్యూ అధికారుల సర్వీసు నిబంధనలు-2008 ను సవరించి ఎవరైనా VRO గ్రేడ్-I&II లు మరణిస్తే వారి వారసులకు , వారి విద్యార్హతను పరిగణలోకి తీసుకొని  డిగ్రీ పాస్ అయ్యి ఉంటే జూనియర్ అసిస్టెంట్ లేదా వారి విద్యా అర్హత ను బట్టి  ఉద్యోగం ఇచ్చే విధముగా గ్రామ రెవిన్యూ అధికారుల సర్వీసు నిబంధనలు-2008 ను సవరణలు చేస్తూ జి.ఓ..నెం.658 తేది:29.09.2022 ను జారీ చేయడం పట్ల ఉమ్మడి కర్నూలు  జిల్లా VRO లందరి తరుపున జిల్లా అధ్యక్షుడు శ్రీ.ఎ.మౌలిబాష ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కృతజ్ఞతలు తెలిపిన వారిలో లో కార్యదర్శి హనుమంత రావు, జిల్లా నాయకులు నాగ మద్దయ్య, జబిఉల్లా, బుద్ధకవి,  కర్నూలు, నంద్యాల,మరియు ఆదోని డివిజన్ అధ్యక్షులు R. నర్సరాజు, ఖాజా హుసేన్, నారాయణ రెడ్డి గార్లు పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియ జేశారు..                                                 

About Author