PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌పంచంలోనే సంపన్నుడు.. సొంత ఇళ్లు లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. పేపాల్‌తో మొదలైన అతని వ్యాపార సామ్రాజ్యం టెస్లాతో ఊహించని స్థాయికి చేరింది. తాజాగా స్పేస్‌ఎక్స్‌తో భవిష్యత్తులో కూడా తనను ఎవరూ టచ్‌ చేయలేనంతగా సంపదను పోగేసుకోబోతున్నాడు. ఇటీవల రెండు బిలియన్‌ డాలర్ల సొమ్ముతో ట్విటర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా మారాడు. అలాంటి ఎలన్‌ మస్క్‌ తనకు స్వంత ఇళ్లు లేదంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెడ్‌ ఇంటర్వ్యూలో మోడరేటర్‌ క్రిస్‌ అండర్సన్‌తో ఎలన్‌ మస్క్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ నాకు సొంత ఇళ్లు లేదు. నేను స్నేహితుల ఇళ్లలోనే ఉంటా. టెస్లా ఇంజనీరింగ్‌ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు తరుచుగా వెళ్తుంటా. అలా వెళ్లిన సందర్భాల్లో నా ఫ్రెండ్స్‌ ఇళ్లలో ఉండే స్పేర్‌ బేడ్‌రూమ్‌లోనే ఉంటాను అంటూ చెప్పారు ఎలన్‌ మస్క్‌.

                                                     

About Author