ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం
1 min readపల్లెవెలుగు, వెబ్ మైలవరం: రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, అప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు అన్నారు.స్థానిక మైలవరం బైపాస్ రోడ్డు లో గల బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ లో తొమ్మిది వందల మందికి శిక్షణ పూర్తిచేసిన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ ఉత్తమ డ్రైవర్లుగా తీర్చిదిద్దడంలో డ్రైవింగ్ స్కూల్స్ ఉపయోగపడతాయని శిక్షణ కాలంలో వాహనాలు నడపడంలో శిక్షణ ఇవ్వడంతో పాటు వాహనాలకు సంబందిన తీరి విధానం భోదించడం, రోడ్డు భద్రతపై కూడా అవగాహన పెంపొందించడం జరుగుతుందన్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న విషయాలను తప్పనిసరిగా పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ పై మరెంత అవగాహన పెంచుకొని వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకంమని, ప్రమాదాలు లేని సమాజంగా తీర్చిదిద్దటానికి డ్రైవర్లు బాధ్యతయుతంగా వాహనాలు నడపాలని ఆయన అన్నారు. రోడ్డు భద్రత పై రూపొందిన ఆవేదన రోడ్డు సేఫ్టీ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాజుబాబు చేతుల మీదగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ మైలవరం తాలూకా యూనిట్ అధ్యక్షుడు రఘుపతి, బెస్ట్ హెవీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ డైరెక్టర్ వై జమలయ్య, ప్రిన్సిపల్ జె రవికిరణ్, రోడ్ సేఫ్టీ ట్రైనర్ కె మురళీకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.