PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోన నియంత్రణలో ‘మీడియా’ పాత్ర కీలకం

1 min read
మాట్లాడుతున్న కడప ఎస్పీ అన్బురాజన్​

మాట్లాడుతున్న కడప ఎస్పీ అన్బురాజన్​

  • కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​
    – జర్నలిస్టులకు మెడికల్​ కిట్ల అందజేత
    పల్లెవెలుగు వెబ్​, కడప : ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా నిలిచిన జర్నలిస్టులు కరోనా వైరస్​ నియంత్రణలో కీలకపాత్ర పోషించారని, అటువంటి మీడియామిత్రులు ఆరోగ్యం కాపాడుకోవాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​ విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఉమేష్​ చంద్ర ఫంక్షన్​ హాల్​లో సోమవారం 300 మంది ప్రింట్​ అండ్​ ఎలక్ర్టానిక్​ మీడియా మిత్రులకు మెడికల్​ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్​ మాట్లాడుతూ నిరంతరం పరితపిస్తూ.. వార్తలు సేకరించే జర్నలిస్టులు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. వైరస్​ నివారణకు గల కారణాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ… అవగాహన కల్పిస్తున్న మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్​ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సునీల్​, ఏఆర్ డిఎస్పీ రమణయ్య, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, పోలీసు సంక్షేమ వైద్యశాల వైద్యురాలు డాక్టర్. సమీరా, ఏపీయూడబ్ల్యు నాయకుడు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author