PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల నిర్వహణలో పివో, ఎపివోలు పాత్ర అత్యంత కీలకం..

1 min read

పివో, ఎపివోల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన, జాగ్రత్త లతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కోరారు. శనివారం స్థానిక కస్తూరిభా బాలికోన్నత పాఠశాలలో ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు,ఎన్నికల నిర్వహణ అంశాలపై తొలివిడత శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ హాజరై పివోలు, ఏపీఓలకు పలు సూచనలు జారీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ ప్రక్రియ అతి ముఖ్యమైనదని, ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాల్సిన గురుతర బాధ్యత పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులదే నని తెలిపారు. గతంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలింగ్ నిర్వహించిన అనుభవం ప్రిసైడింగ్ అధికారులకు ఉన్నప్పటికీ,  వివిప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లకు వివిపాట్లను సరైన రీతిలో జోడించే విధానం గురించి సమగ్ర అవగహన పొందాలని సూచించారు. ఈవిఎంల నిర్వహణ, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా అందజేయబడుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఏవైనా సందేహాలు ఉంటే వాటిపై నివృత్తి చేసుకోవాలన్నారు.  ఎన్నికల నిర్వహణలో వారికి నిర్ధేశించిన విధుల్లో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. పొరపాటు చేస్తే ఎన్నికల కమీషన్ పరిధిలో చర్యలు ఉంటాయని ఆయన గుర్తుచేశారు. పోలింగ్ రోజు సకాలంలో ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేసి ముందుగా మాక్ పోల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మాక్ పోల్ డేటాను క్లియర్ చేసిన అనంతరం. పోలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.  ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. అలాగే ఓటింగ్ ముగిసిన పిదప సక్రమంగా పోల్ క్లోజింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కు సంబంధించిన అంశాలను ప్రీపైడింగ్ అధికారుల డైరీలో విధిగా నమోదు చేసి, ఫారమ్-17 పి బ్యాలెట్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్లులతో పాటు రిసెప్షన్ కేంద్రంలో సమర్పించాలని తెలిపారు. అలాగే ప్రిసైడింగ్ అధికారులు నింపవలసిన ఫారాలన్నింటిని పోలింగ్ ముగిసిన వెంటనే సక్రమంగా పూర్తి చేసి సిద్దం చేసుకుంటే, రిసెప్షన్ కేంద్రంలో ఎక్కవ సమయం వేచి ఉండాల్సిన అవసరం రాదన్నారు. పోలింగ్ ముందు రోజు నిర్ధేశించిన సమయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ యంత్రాలు, మెటీరియల్ సేకరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి, ఎఆర్ఓ వి. మురార్జి, అసెంబ్లీ స్ధాయి మాస్టర్ ట్రైనీలు, పిఓలు, ఏపిఓలు, పాల్గొన్నారు.

About Author