PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్త ల పాత్ర అమోఘం

1 min read

కోట ఉన్నత పాఠశాల లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోట నందు ఈ రోజు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రార్థనా సమయంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో సర్ సి.వి.రామన్  చిత్ర పటానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సలీం భాష మరియు ఉపాద్యాయ సిబ్బంది పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం అంటే సర్ సి.వి.రామన్ జయంతి అని కొందరు భావిస్తారు, కానీ ఫిబ్రవరి 28  1928న సర్‌ సి.వి.రామన్‌, తన “రామన్‌ ఎఫెక్ట్‌” ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును  భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా నిర్వహిస్తారు అని పేర్కొన్నారు.   పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు  సాలమ్మ  మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది అని, సర్ సీ . వీ.రామన్ గారి పరిశోధన యొక్క విలువను గుర్తించి 1954 లో భారత అత్యున్నత పౌర పురస్కారం “భారత రత్న” ప్రధానం చేశారని అలాగే అంతకు ముందే 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు శారదమ్మ, సాలమ్మ ,అరుణా విజయ భారతి, లలితమ్మ ,సరోజినీదేవి, శంషాద్ బేగం ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు , శ్రీనాథ్ , మల్లిఖార్జున రెడ్డి, నాగశేషులు, రికార్డు సహాయకులు మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author