PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్ ఎప్పుడంటే !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా తెర‌కెక్కుతోన్న చిత్రం “ఆర్ఆర్ఆర్`. ఎప్పుడెప్పుడా అంటూ సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల అవుతుంది. అయితే.. డిసెంబ‌ర్ 3న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్ టైన్మెంట్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రైల‌ర్ విడుద‌ల తేదిని ప్ర‌క‌టించింది. తార‌క్, చ‌ర‌ణ్, అలియా భ‌ట్, అజ‌య్ దేవ్ గ‌ణ్ లతో కూడిన ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

About Author