టీవీ సీరియల్ లో పాలకుడు.. నిజజీవితంలో అధ్యక్షుడయ్యారు !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ వైపు చూస్తోంది. పలు దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. రష్యా అధ్యక్షుడు జెలెన్ స్కీ కు రష్యాలో వేల మంది అభిమానులు ఉన్నారు. అదెలా అంటే.. అధ్యక్షుడు కాక మునుపు జెలెన్‌స్కీ ఓ కమెడియన్. ఆయన నటించిన ఓ టీవీ సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందింది. యాధృచ్ఛికంగా ఓ దేశానికి పాలకుడైన వ్యక్తి పాత్రలో జెలెన్‌స్కీ నటన ఆయనకు అనేక మంది అభిమానుల్ని సంపాదించింది.
ఎన్నికల్లో విజయం :
జెలెన్ స్కీ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డారు. అనేక వాగ్దానాలను చేశారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని చెప్పడమే కాకుండా, కేవలం ఒక పర్యాయమే అధ్యక్ష పదివిలో కొనసాగుతానని కూడా ప్రజలకు మాటిచ్చారు. చర్చల ద్వారా రష్యాతో విభేదాల్ని తొలగిస్తానంటూ ప్రజలకు మాటిచ్చారు జెలెన్‌స్కీ. ఊహాజనిత లోకంలో అధ్యక్షుడిగా అద్భుతాలు సృష్టించిన ఆయన నిజజీవితంలో అందులో కొంతైనా చేయకపోతారా అనుకుంటూ ప్రజలు ఆయనకు 2019లో దేశ పగ్గాలను అప్పగించారు. కానీ ప్రస్థుత పరిస్థితులు ఆయన గతంలో ఎన్నడూ ఊహించని విధంగా మారిపోయాయి. ప్రస్తుతం.. రష్యా సేనలు దేశంలోకి అన్ని వైపుల నుంచీ దూసుకొస్తుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు జెలెన్‌స్కీ.