రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతం
1 min read– గత 12 సంవత్సరాలుగా కార్యక్రమాలు..
– వందలాదిగా పాల్గొన్న యువతీ యువకులు, సంఘ పెద్దలు, మహిళలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆరాధన ఛానల్ వారు నిర్వహించు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం శనివారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం నుండి ప్రారంభమై. ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్ నుండి. వసంత మహల్ సెంటర్. జూట్ మిల్ సెంటర్. ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వద్ద ఇండోర్ స్టేడియం వరకు వందలాదిమంది దైవజనులు. క్రైస్తవ సంఘ పెద్దలు మరియు యువతి యువకులతో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాల నుండి ఆరాధన ఛానల్ వారి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో సుమారు 500 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ఏలూరు ఆర్ సి ఎం పీఠాధిపతి రైట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర మరియు ఐ సి ఎం సంఘాల పీఠాధిపతి బిషప్ జాన్ ఎస్ డి రాజు. ప్రార్థనలు చేసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఏసుక్రీస్తు సిలువ శ్రమ. మరణ పునరుద్దానాన్ని స్మరించుకుంటూ ఈస్టర్ పండుగ పర్వదిన సందర్భంగా. క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచి మరణాన్ని జయించారని తిరిగి మహిమతో త్వరలో రానై ఉన్నాడని విశ్వసిస్తూ సువార్తను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తంగిళ్లమూడి పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బీరపోగు యోహాను ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఆరాధన ఛానల్ ఏలూరు కోఆర్డినేటర్ బురదగుంట క్రాంతి రవి కిరణ్, యు పి ఎఫ్ గౌరవ అధ్యక్షులు పి వి రాజు, ఆర్ సి ఎం కెథట్రల్ ఫాదర్ ఐ మైఖేల్, హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్ గురు మండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పి పి ఎస్ కిరణ్ , యు పి ఎఫ్ అధ్యక్షులు పాస్టర్ టి ఆనందకుమార్ , డి ఆదామ్ బహదూర్, టి పి ఎఫ్ గౌరవ అధ్యక్షులు ఎ వర కుమార్, ఎం పౌలు రాజు, రాపాక రాజు, కె సీమోను, డి సురేష్ , జయానందం, కె జాన్ కెనడి, వై సువర్ణ పాల్, పి రవికుమార్, జి స్వర్ణకుమారి, కె సునీత దాస్, కె సి ఆనంద్, మరియు అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు యవనస్తులు, స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.