పెళ్లి అనే పవిత్ర బంధం దేవుడు కల్పించిన గొప్ప వరం
1 min read
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి
హోళగుంద, న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గంలోని హోళగుంద మండలం ఇంగళదహల్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ప్రహలధ్ రెడ్డి సోదరుడి కుమారుని వివాహ కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు హోళగుంద మండలంలోని కొగిలతోట గ్రామానికి చెందిన జెడ్పిటిసి కుటుంబానికి చెందిన కురువ శేషప్ప మరియు గాధి లింగప్ప కుమారుల వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి అనే పవిత్ర బంధం దేవుడు కల్పించిన గొప్ప వరం అని ఆయన పేర్కొంటూ, నూతన వధూవరులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోశాలతో, ఆనందంతో నిండిన దాంపత్య జీవితం వారు గడపాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మరియు కార్పొరేటర్ సత్యనారాయణమ్మ, వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు హాలిగేర కేశం వెంకట రెడ్డి, ఆస్పరి ఎంపీపీ.. భర్త రామాంజినేయులు, సర్పంచులు వెంకట రామిరెడ్డి, విరూపాక్షి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, యక్షోజప్ప, గురుధాస్ రెడ్డి, వెంకటరెడ్డి, మరియు నాయకులు మేఘనాథ్ రెడ్డి, రామిరెడ్డి, పార్థసారధి, చంద్రశేఖర్, కమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, మరియు తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.