విప్లవ వీరుల త్యాగం నేటి యువతకు ఆదర్శం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విప్లవ వీరులు భగత్ సింగ్, రాజగురు ,సుఖ్ దేవ్ ల 92 వ వర్ధంతి సందర్భంగా గురువారం పిడిఎస్ యూ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బాలుర హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థులు భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా డివిజన్ ప్రధాన కార్యదర్శి పి. మర్రిస్వామి మాట్లాడుతూ.భారతదేశ చరిత్రలో ఈ రోజు అనగా మార్చి 23,1931 న ముగ్గురు విప్లవకారులు ఒకేసారి దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని వారే భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ దేవ్ లని అన్నారు. భగత్ సింగ్ జీవితంలో 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం భగత్ సింగ్ శరీరంలోని రక్తాన్ని మరిగించింది. బ్రిటీష్ ప్రభుత్వంపై విపరీతమైన కోపం వచ్చేలా చేసిన ముఖ్యమైన అంశమని…23 సంవత్సరాల యవ్వనంలో భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారు పై వీరోచితంగా పోరాడి ఉరికొయ్యను ముద్దాడిన వీరుడు… భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నా అందులో భగత్ సింగ్ మహాఘనుడు అందుకు కారణం అతని ధైర్య సాహసాలేనని సాయుధ పోరాట మార్గం ద్వారానే స్వాతంత్రం సాధించగలమని ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ జాతిని మేలుకొలిపి ప్రజల్ని చైతన్య పరచాడాని. దేశ ప్రజల్లో విప్లవస్ఫూర్తినీ నింపి భారత స్వతంత్ర ఉద్యమాన్ని మరో మెట్టు ఎక్కించారని అన్నారు మన స్వతంత్రం మన చేతుల్లోనే ఉందని భావించిన వ్యక్తులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు ఆ ముగ్గురు బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు ఆ ముగ్గురిలో దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తి జ్వాలను రగిలించే శక్తిని గ్రహించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పోరాటాన్ని అణచివేసి వారిని ఉరి తీయడం జరిగిందన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అదానీ,అంబానీ చేతిలో దేశ సంపదను పెడుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. విద్య వ్యతిరేక విధానాల కొనసాగిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని పక్క రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పరిస్థితుల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు రాజు,అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు.