అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిది..
1 min read– అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లుచున్న సీఎం జగన్…
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఆంధ్రరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన శ్రీ పొట్టిశ్రీరాములు వంటి ఎందరో త్యాగధనులును స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో, నిబద్ధతతో ముందుకెళదామని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి మంగళవారం నందికొట్కూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరనీయుడన్నారు. 1953 అక్టోబర్ 1 న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, తొలి బాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956 నవంబర్ 1 న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగిస్తూ, తెలుగు ప్రముఖులును గౌరవించుకుంటూ, ఆంధ్రుల చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా మనమందరం నిలవాలని , తెలుగు జాతి ఐక్యతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పాలన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పేదల అభ్యున్నతే ధ్యేయంగా, అర్హులందరికీ సంక్షేమ ఫలాలును అందిస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ, భగవంతుడి దీవెనలుతో, ప్రజల ఆశీస్సులుతో విజయబాటలో నడుస్తోందన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు వెల్లుచుండడం హర్షణీయమని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా మన్నారు.రాష్ట్రంలో అమలవుతు న్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం మన రాష్ట్రామన్నారు. ప్రపంచంలోనే మన తెలుగు బాషకు ప్రత్యేక విలువ, గుర్తింపు, గౌరవం ఉందన్నారు.రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన త్యాగధనుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ ను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ ఆర్య వైశ్య సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ సుకుర్ , పట్టణ కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల జాకీర్ ,కొనిదేల సర్పంచి కొంగర నవీన్ ,నందికొట్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల ఉసేనయ్య, వైసిపి నాయకులు తమ్మడపల్లె విక్టర్, ముజీబ్, మాధవరం. యేసురత్నం , ప్రవీన్, భాస్కర్, ఏసేపు, రత్నం, వేల్పుల నాగన్న, మాధవరం సంజన్న, హుస్సేన్ భాష, మల్యాల శంకరు, బిజినవేముల మహేష్, కొనటమ్మ పల్లి రఘు, మాభాష, జాను, రఫీ,దిలీప్ రాజ్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.