భక్తుల భద్రతే.. ముఖ్యం
1 min read– ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప
పల్లెవెలుగు, శ్రీశైలం
దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పోలీసు సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు, సీస కెమెరాలు, కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంపుల్ క్యూలైన్లు పరిశీలించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. మదుసుధన్ రావు, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులు ఉన్నారు.