మహానంది దేవస్థాన ఆలయ భద్రత గాలికి వదిలేశారు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది దేవస్థానం ఆలయ భద్రత గాలికి వదిలేసినట్లు విశ్వాసనీయ సమాచారం.. ఆదివారం మహానంది క్షేత్రంలో పనిచేసే ఆలయ ఒక ఉద్యోగిపై కొందరు యువకులు మద్యం మత్తులో దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలోని ప్రధాన కోనేరులో స్నానం చేయుచుండగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొంతమంది పై అక్కడ పనిచేసే సిబ్బంది ఒకరు వారించగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇది గోప్యంగా ఉంచినట్లు సమాచారం. గత ఏప్రిల్ 12వ తేదీన మహానంది క్షేత్రంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఒక కుటుంబ సభ్యులు కోనేటిలో స్నానం చేయుచు గట్టుపై ఉంచిన బ్యాగును దొంగలించి ఒక వ్యక్తి అందులో ఉన్న నగదు తో పాటు సామాన్లు భద్రపరచు కౌంటర్ వద్ద ఇచ్చినటువంటి రసీదు ఆధారంగా చోరీకి గురి అయిన భక్తుల బ్యాగుల నుండి సేకరించిన రసీదులు ఆధారంగా సామాన్లు భద్రపరిచే గది వద్ద రసీదును అప్పగించి దర్జాగా చోరీకి పాల్పడడం వివాదాస్పదంగా మారింది. దీనికంతటి కారణం ఆలయంలో భద్రత పర్యవేక్షణ లోపం అని పలువురు భావిస్తున్నారు. 6 మంది హోంగార్డులు విధులు నిర్వహించాల్సి ఉండగా కేవలం ముగ్గురిని మాత్రమే షిఫ్ట్ పద్ధతిలో ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన మహానంది క్షేత్రం లో భద్రతా లోపాలు కారణంగా పలు సంఘటనలు జరుగుతున్న తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని గాలికి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఆలయ భద్రతపై ప్రత్యేకంగా విచారణ మరియు పరిశీలన జరిపి భద్రతకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు సూచించిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. హోంగార్డులకు అంత జీతాలు ఎందుకు చెల్లించాలి. ఒకరిద్దరితో సర్దుకుంటే సరిపోదా.. అనే ధోరణంలో ఆలయ అధికారి వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆది మరియు సోమవారం రెండు రోజులపాటు ఒక హోంగార్డు సెలవు పెట్టిన వారి స్థానంలో విధుల్లో భాగంగా ఎవరిని నియమించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కూత వేటు దూరంలో మహానంది పోలీస్ స్టేషన్ ఉన్న దీంతోపాటు ఆలయ టూరిజం పేరుతో క్షేత్ర ఆవరణలో పోలీసులు అట్టహాసంగా ప్రారంభించి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి విధులు నిర్వహించాల్సి ఉన్న ఎక్కడ కనిపించడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.