బైరాపురం సర్పంచ్ ఇక లేరు..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని బైరాపురం గ్రామ సర్పంచ్ కదిరి ఫణి భూషణ్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఊపిరితిత్తుల వ్యాధి ఉండటం వల్ల గత రెండు నెలల నుంచి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు.కోలు కోలేక ఆయన మృతి చెందారు.గ్రామ అభివృద్ధి గ్రామ సమస్యల గురించి అనునిత్యం అధికారుల దృష్టికి తీసుకువచ్చేవారు.2021లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతు దారుడిగా సర్పంచ్ గా గెలుపొందారు.ఈయనకు భార్య అనిత,సంతానం మహేందర్ రెడ్డి,శిల్పా చదువుతున్నారు.