PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం రాకపోతే పథకాలు ఆగిపోతాయి

1 min read

వైసీపీ పథకాలను టీడీపీ నిలిపివేస్తుంది

పైన భగవంతుడు కింద ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్తున్నాడు

మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా గెలిపించుకుద్దాం

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సుధీర్ ధారా

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు అన్ని అందకుండా పోతాయని టీడీపీ ప్రభుత్వం వైసీపీ పథకాలను నిలిపివేస్తుందని నందికొట్కూరు  వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి డా.సుధీర్ ధారా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కుట్రలు తిప్పికొట్టాలని మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. శనివారం  నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జై కిసాన్ పార్కు నందు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డ  అధ్యక్షతన మున్సిపల్ కమీషనర్  టి.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో  జైకిసాన్ పార్కు నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో   శనివారం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .. పట్టణంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు  కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 2015 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామన్నారు. అంతే కాకుండా ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత ఒక్క జగనన్నకే సాధ్యం అని అన్నారు. శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా నందికొట్కూరు ను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. మొదటి విడతలో మున్సిపాలిటీ లోని 1 నుండి 8వ వార్డు సచివాలయాల పరిధిలో 682 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సుధీర్ ధారా  మాట్లాడుతూ కుల, మత, వర్గ, పార్టీలు చూడకుండా, పేదలందరికీ మంచి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మంచి చేశానని భావిస్తేనే ప్రజలు తనకు ఓట్లు వేయాలని సీఎం జగన్ ప్రజల ముందుకు వచ్చి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 14 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు, 5ఏళ్లు మద్దతుగా ఉన్న పవన్ ప్రజల కోసం ఏం చేశారో చెప్పకుండా, జగన్ ను తిడుతూ ఓట్లు అడుగుతున్నారని  విమర్శించారు.పైన భగవంతుడు కింద ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ ఎన్నికలకు వెళ్తున్నాడు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా గెలిపించుకుద్దామని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ లోని  682 మంది ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ప్రభుత్వ రిజిస్టర్ పట్టాలను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ,కమిషనర్ టి.సుధాకర్ రెడ్డి లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరి దేవి, కౌన్సిలర్ లు కాటెపోగు చిన్నరాజు, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, చాంద్ భాష, చెరుకు సురేష్, అల్లూరి క్రిష్ణ, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, ఎస్సి సెల్ బొల్లెద్దుల రామక్రిష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, సన అబ్దుల్లా, శాలి భాష, సచివాలయ వి.ఆర్.ఓ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

About Author