వెనక్కి వెళ్లిన సముద్రం.. !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడులోని మహాబలిపురంలో అద్భుతం ఆవిష్కృతమైంది. హఠాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నీరు వెనక్కి వెళ్లడంతో తీరంలో పురాతన ఆలయ కలశం, రాతి స్తంభాలు, ఇటుకరాళ్లు బయల్పడ్డాయి. వాటిపై పరిశోధన చేయాలని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి నరసింహ పల్లవ రాజు హయాంలో మహాబలిపురం తీరంలో సముద్రం వెనక్కివెళ్లిన సమయంలో తీరం వెంబడి చిన్న చిన్న ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సముద్రంలో అలలు ఎగిసిపడే సమయంలో ఈ ఆలయాలు నీట మునుగుతుంటాయి. ఈ నేపధ్యంలో, బుధవారం సాయంత్రం మరోమారు సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరంలో బయటపడిన కలశాలు, రాతి స్తంభాలు తదితర పురాతన కళాఖండాలను వీక్షించేందుకు గురువారం ఉదయం నుంచే స్థానికులు, పర్యాటకులు మహాబలిపురంలో గుమిగూడారు.