తొలి ఏడాది కంటే..రెండో ఏడాది దారుణం..!
1 min read
3D illustration of Coronavirus, virus which causes SARS and MERS, Middle East Respiratory Syndrome
పల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ దాడి తొలి ఏడాది కంటే రెండో ఏడాది దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అధనామ్ అన్నారు. భారత్ లో కరోన పరిస్థితి మీద ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరగడం, మరణాలు తగ్గకపోవడం చూస్తుంటే.. భారతలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో భారత్ కు కావాల్సిన సహాయం చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ , మొబైల్ ఆస్పత్రులు, మాస్కులు అందించామని తెలిపారు. ఇంకా అవసరమైన వైద్య సదుపాయాలు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. భారత్ కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.