రెండు గంటలకే సచివాలయానికి తాళం
1 min read– హాజరుకే సచివాలయాలు ఎప్పుడు వస్తారో వెళ్తారో
-ప్రభుత్వ ఆశయానికి తూట్లు -సచివాలయాలపై మండల అధికారుల నిర్లక్ష్యం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు :మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయానికి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకే తాళం వేసి ఉంది.ముఖ్యమంత్రి జగన్ సర్కార్ 2019 అక్టోబర్ 2న ప్రజల వద్దకే సచివాల వ్యవస్థను తీసుకువచ్చింది.మండలంలో మొత్తం 14 సచివాలయాలు ఉండగా ప్రతి సచివాలయానికి 10 మంది చొప్పున ఉద్యోగాలు కల్పించింది.గత సంవత్సరమే వీరిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించింది.కానీ గ్రామ సచివాలయాల్లో సిబ్బంది హాజరుకు మాత్రమే వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారోనని ప్రజలు ఆరోపిస్తున్నారు.పంచాయతీ కార్యదర్శి వినోద్,వెల్ఫేర్ అసిస్టెంట్ హజరత్ మౌలాలి, మహిళా పోలీస్ శాంతి,ఏఎన్ఎం రామతులశమ్మ,గ్రామ వ్యవసాయ సహాయకులు చంద్రకళ,డిజిటల్ అసిస్టెంట్ శ్రావణ్ సచివాలయంలో ఎవరూ లేరని తాళం వేసి వెళ్లిపోవడం వలన ప్రజలు వచ్చి వెళ్తున్నారని సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా తయారు అయ్యారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా సోమవారం నుండి శనివారం వరకు ప్రతి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల అధికారులు అందరూ కూడా ఉండి ప్రజా సమస్యల వినతులను స్పందన ద్వారా అర్జీలను వారు స్వీకరించాలి.కానీ ఎక్కడా కూడా అలా జరగడం లేదని వివిధ గ్రామాల ప్రజలు సిబ్బంది పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు.సచివాలయాలపై మండల అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.సిబ్బందిని ప్రజలకు సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఉదయం10 నుంచి సాయంత్రం5:30 దాకా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మండల అధికారులు వారిని చక్కబెడతారా లేదా అన్నది వేచి చూడాలి.ఇలాగే కొనసాగితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ విధుల్లో చక్కబెడతారా లేదా అన్నది త్వరలో…?