NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

1 min read

పత్తేబాధలో వృద్ధులకు అందిస్తున్న వసతులు, పరిశుభ్రతపై ఆరా

నిరాధారణనకు గురైన వృద్ధుల వారి పిల్లలనుండి భరణం ఇప్పించడం జరుగుతుంది

ఉచిత న్యాయసలహా టోల్ ఫ్రీ నెంబర్ 15100

పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ బుధవారం స్థానిక పత్తేబాద్ లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహం లోని వృద్ధులకు అందిస్తున్న వసతులపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ పరిసర ప్రాంతాలలోని  డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, వృద్ధుల ఆరోగ్య విషయంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని సూచించారు.  అలాగే వసతిగృహంలోని వారితో మాట్లాడుతూ నిరాధారణకు గురైన వృద్ధులకు వారి పిల్లల నుండి భరణి ఇప్పించడం జరుగుతుందని,పిల్లల పేర్లు రాసిన ఆస్తులను ఏమైనా ఉన్నా తిరిగి వెనక్కి తీసుకోవచ్చని, ఇటువంటి సమస్యలు ఎదురైన  వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్ తుమ్మలపల్లి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author