NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాస‌రి శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయం

1 min read

– సమాచార శాఖ క‌మిష‌న‌ర్ తుమ్మా విజ‌య్‌కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: వృత్తినే దైవంగా భావించి, ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వర్తించడం, సమయపాలన, క్రమశిక్షణ, సేవ చేయడంలో నిగర్వి, నిరాడంబరుడైన డి.శ్రీనివాస్ అందరికీ ఆదర్శమని సమాచార శాఖ క‌మిష‌న‌ర్ తుమ్మా విజ‌య్‌కుమార్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో దాసరి శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ తప్పనిసరన్నారు. వృత్తిలో ఉన్నంతవరకు విధి నిర్వహణ పట్ల ఉద్యోగులు అంకితభావంతో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ ఉద్యోగ ప్రస్థానాన్ని, ఉద్యోగిగా సమాచార పౌర సంబంధాల శాఖకు అందించిన సేవలను, జీవితంలో కష్టపడి క్రింది స్థాయి నుండి ఉన్నతస్థాయికి ఎదిగిన క్రమం వంటి అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఆయన పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. రిటైర్మెంట్ అనంతరం భావిజీవితం సంతోషంగా, ప్రశాంతంగా కుటుంబసభ్యులతో గడపాలని కాంక్షించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు ఎన్.వెంకటేష్, పి.కిరణ్‌కుమార్, కస్తూరిబాయి తేళ్ల, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ.మధుసూధన్, డిప్యూటీ డైరెక్టర్లు ఐ.సూర్యచంద్రరావు, ఎం.వెంకటేశ్వర ప్రసాద్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ సి.వి.కృష్ణారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు, పీఆర్వోలు, సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author