జర్నలిస్ట్,పోలీస్,ఫైర్ సిబ్బంది ఆస్పత్రి సిబ్బంది సేవలు ఎనలేనివి
1 min read
రంజాన్ ని పురస్కరించుకొని తెలుగు ఖురాన్,ఖర్జూరం పంపిణీ
డా:షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ)
ఏపీ నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరులో జర్నలిస్ట్ లకు రంజాన్ పండుగ ను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ నూర్ భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘo అధికార ప్రతినిధి డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ( గాజుల బాజీ) రంజాన్ ఖర్జూరం అందజేశారు,ఈ సందర్భంగా దాదాపు 150 మంది జర్నలిస్ట్ లకు, ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రి సిబ్బందికి, ఫైర్ సిబ్బందికి, ఖర్జూర పండు, తెలుగులో అనువదించబడిన ఖురాన్ గ్రంథం అందజేశారు,ప్రతి ఏటా ఏలూరులో జర్నలిస్ట్ లకు ఇలాంటి తోఫా అందజేస్తున్నట్టు సయ్యద్ బాజీ గుర్తు చేశారు. నిరంతరం ప్రజలకు సేవలు అందించే వారిలో (ఫోర్త్ ఎస్టేట్ )గా పిలవబడే జర్నలిస్టులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. అలాగే ప్రజలను అకాల అగ్ని ప్రమాదాల, ఆపదల నుండి అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల తీవ్రతను నివారించడంలో వారు నిష్ణాతులన్నారు. వారి సేవలను ఆపత్కాలంలో ప్రజలకు వినియోగిస్తారన్నరు. నిత్య జీవితంలో ప్రతి మనిషి వ్యాధి బారిన, లేక ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని అటువంటివారు ఆసుపత్రి కి చేరవలసిన అవసరం వారి సేవలను వినియోగించుకునే అవసరం ఎంతైనా ఉంటుందని అటువంటి సేవ మూర్తులను గుర్తు చేసుకోవడం అవసరమందన్నారు. అనంతరం ఆయన జర్నలిస్టులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాన్ని పంచుకున్నారు.