లక్ష్మన్న ,నాగన్న ల సేవలు మరువలేనివి : జిల్లా కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రం సభ్యుల మరణం జిల్లా కురువలకు తీరని లోటన్నారు కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి. శనివారం ఉదయం సంఘం కార్యాలయం లో వాడాల నాగన్న ,లక్ష్మన్న ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్బంగా జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం వారు కేటాయించిన 75 సెంట్ల స్థలములో సత్రం నిర్మాణం కోసం మరియు అన్నదానం కోసం అహర్నిశలు కృషి చేసారని వారి సేవలను కొనియాడారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ లక్ష్మన్న ,నాగన్న లు సంఘం పురోభివృద్ధి కోసం జిల్లా స్థాయిలో కృషి చేసారని తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు ,కోశాధికారి కే .సి .నాగన్న ,టి .రాంకుమార్ ,టి .పాలసుంకన్న ,సహాయకార్యదర్శి వెంకటకృష్ణ ,కే .నారాయణ ,కే .మద్దిలేటి ,నగర సంఘం కార్యదర్శి బి .వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షు కే .రాజు ,కోశాధికారి కే .వెంకటేశ్వర్లు ,కే .దివాకర్ ,కే .బాలరాజు ,కే .ఎల్లప్ప ,నగేష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.