PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘లివిన్ డయాజ్ఞస్టిక్స్’ సేవలు హర్షనీయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్యజిల్లారాయచోటి/వీరబల్లి:సామాజిక సేవా కార్యక్రమాలల్లో కడప లివిన్ డయాజ్ఞస్టిక్స్ సేవలు హర్షనీయమని డాక్టర్ వినయ్ బాబు, డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వీరబల్లి  ప్రభుత్వ ఆసుపత్రికి లివిన్ ఎండి గాలివీటి వివేకానంద రెడ్డి దాతృత్వంతో నాణ్యమైన రక్త పరీక్షలు కొరకు సెంట్రీ ఫ్యూజ్ మెషిన్ అందచేసారని తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.వైద్య పరీక్షలు నిమిత్తము పేద ప్రజలు పట్టణ ప్రాంతాలు వెళ్లకుండా ఈ మెషిన్ తో  అన్నిరకాల రక్త పరీక్షలు చేసుకోవచ్చన్నారు .లివిన్ ఎండి వివేకానంద రెడ్డి మాట్లాడుతు తమ ల్యాబ్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే వీరబల్లి ప్రాథమిక కేంద్రానికి తమ వంతు సహాయంగా ఇచ్చామన్నారు. భవిష్యత్తు లో పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బందులు ఎదుర్కోకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే అన్ని రకాల సేవలు అతి తక్కువ దరలోనే చేయడానికి తమ ల్యాబ్ ముందుకు వస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్డీఎస్ సురేంద్రారెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ కల్పన ,సొరువు రాము,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author