NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ అడ్వకేట్ శ్రీరాములు సేవలు అభినందనీయం

1 min read

– మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: న్యాయవాద వృత్తిలో, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో సీనియర్ అడ్వకేట్ శ్రీరాములు చేసిన సేవలు అభినందనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ అన్నారు. స్థానిక బిఏఎస్ కళ్యాణమండపం లో ఈరోజు శ్రీరాములు సంస్మరణ సభ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ లో ప్రొఫైల్ తో ఉండి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కలిగిన వ్యక్తి శ్రీరాములు అని కొనియాడారు. చిన్మయ మిషన్ స్కూలు కమిటీలో తాను, శ్రీరాములు సభ్యులుగా ఉండేవారని అప్పుడు అందరం కలిసి స్కూల్ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే వారమని టీజీ తెలిపారు. ఏ పని తలపెట్టిన ఆచితూచి, క్రమశిక్షణగా పద్ధతిగా జరగాలని శ్రీరాములు కోరుకునే వారిని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో దాశెట్టి శ్రీనివాసులతోపాటు, పలువురు న్యాయవాదులు, నగురూరూ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author