నర్సుల సేవలు అభినందనీయం…
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక నందికొట్కూరు పట్టణమునందు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న నర్సులకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వి. రఘు రామమూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు గణనీయ పాత్ర వహిస్తున్న వారిలో వైద్యులు నర్సులు రోగులకు అపారమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వైద్య చరిత్రలో ఎనలేనిసేవలు అందిస్తున్నటువంటి నర్సుల సేవా చాలా అమూల్యమైనదన్నారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల సేవల కంటే వైద్య చరిత్రలో ప్రజలకు సేవలో అందిస్తున్నటువంటి నర్సులు చాలా గొప్పవారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది ప్రజలు చనిపోతున్నప్పటికీ నర్సులు ప్రాణాల సైతం లెక్కచేయకుండా కరోనా వచ్చిన వారికి వైద్య సేవలు అందించడం వారి సేవా గుణాన్నికి నిదర్శనమని అన్నారు. అటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మహానంది , వీరేంద్ర, ఎఐటియుసి పట్టణ నాయకులు రాముడు, రాకేష్, డి. మున్న, శంకర్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.