NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాలంటీర్ల సేవలు ప్రశంసనీయం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిస్వార్థంగా లబ్దిదారుల చెంతకు చేర్చుతున్న వలంటీర్ల సేవలు ప్రశంసనీయమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. గురువారం సాయంత్రం వెల్దుర్తి మండల కార్యాలయం ఆవరణంలో వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా  మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ వ్యవస్థను ప్రవే శపెట్టి గ్రామాల్లోని ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్దిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే చేరవేయడంలో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు.వలంటీర్ల సేవలవల్ల ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీలు బెంబేలెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. అంతకుముందు పలువురు వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, మండలంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడారు. ఎంపిడిఓ శివశంకరప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో మండల కన్వీనర్ రవి రెడ్డి,జెడ్పీటీసీ సుంకన్న, సర్పంచ్ ముత్యాల శైలజ, వెల్దుర్తి వ్యవసాయ సలహామండలి చైర్మన్ కొత్తూరు వెంకటేశ్వర రెడ్డి,వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ వెంకటనాయుడు, మరియు మండలం లోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author