నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి
1 min readజేసీ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కరోనా అనగానే అల్లంత దూరం పారిపోయే కుటుంబ సభ్యులున్న నేటి రోజుల్లో కరోనా రక్కసి చేతిలో విలవిలలాడుతున్న కరోనా బాధితులకు నర్సులు అందిస్తున్న సేవలు ఎనలేనివి జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు అన్నారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని నర్సులు అందిస్తున్న సేవలను కొనియాడారు. స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) వారి కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బృందం ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని కరోనా మహమ్మారి తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన ప్రభుత్వ గవర్నమెంట్ నర్సులను మంజుల, నర్సింగ్ సూపరింటెండెంట్ బాయ్ లను జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సాయి ప్రదీప్, రమేష్ బాబు, రాజశేఖర్, శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వ నర్సింగ్ సంఘం నాయకురాలు మంజుల, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ సూపర్డెంట్ భాయ్, స్వచ్ఛంద సంస్థ నాయకుడు శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.