NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెదిరించిన‌ట్టు ఒప్పుకున్న ఎమ్మెల్యే కొడుకు.. మొత్తం 12 కేసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామ‌కృష్ణ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క నిందితుడు వ‌న‌మా రాఘ‌వేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. రామ‌కృష్ణ‌ను బెదిరించిన‌ట్టు వ‌న‌మా రాఘ‌వేంద్ర ఒప్పుకున్న‌ట్టు ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ల‌భ్య‌మైన ఆధారాలు సీజ్ చేసి కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. నిందితుల్ని ఇవాళ కొత్త‌గూడెం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుస్తామ‌ని ఏఎస్పీ రోహిత్ చెప్పారు. ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌రరావు కొడుకు వ‌న‌మా రాఘ‌వేంద్ర పై మొత్తం 12 కేసులు ఉన్నాయ‌ని, వాటి పై కూడ విచార‌ణ జ‌రుపుతామ‌ని వెల్ల‌డించారు. వ‌న‌మా రాఘ‌వ పై ఫిర్యాదు చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని, కేసు విచార‌ణ ద‌శ‌లో ఉన్నందున పూర్తీ వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని ఏఎస్పీ రోహిత్ తెలిపారు.

                                        

About Author