పది దాటితే సౌండ్ వినపడకూడదు !
1 min read
Sound speaker in neon light on black.
పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ నగర పరిధిలోని పబ్‌లపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటలు దాటితే పబ్‌లలో ఎలాంటి సౌండ్ వినబడరాదని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా పబ్‌లకు అనుమతుల విషయంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నగర పరిధిలో ఇప్పటిదాకా ఎన్ని పబ్‌లకు అనుమతులు జారీ చేశారన్న విషయాన్ని కూడా కౌంటర్‌లో పేర్కొనాలని హైకోర్టు ఆదేశించింది.