త్రాగునీటిలో సమస్యలు తలెత్తకుండా వాటర్ వర్క్స్ సిబ్బంది అప్రమత..
1 min read
అర్ధరాత్రి వరకు అన్ని వాటర్ ట్యాంకుల వద్ద లోపాలను క్షుణ్ణంగా పరిశీలన
లోపాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగరంలో త్రాగునీటి సరఫరాలో పలు సమస్యలు ఉన్నాయని రంగు మారిన త్రాగునీటిని సరఫరా చేస్తున్నారంటూ ఇటీవల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. కమిషనర్ ఈ విషయంపై వెంటనే స్పందించి రెండు రోజులపాటు రాత్రనకా పగలనకా ఓవర్ హెడ్ ట్యాంకుల వద్దకు, ఎస్ ఇ, ఇఇ, డిఇ, ఏఇ లు పంపుల చెరువు దగ్గరకు దాదాపు నగరంలో ఉన్న అన్ని తాగునీటి సరఫరా పాయింట్లకు తిరిగి అర్థ రాత్రి వేళల్లో కూడా ఇంజనీరింగ్ విభాగాన్ని అప్రమత్తం చేసి అసలు సమస్య ఎక్కడ ఉందో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునేందుకు సిబ్బంది రంగం సిద్ధం చేశారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపారు. ఎక్కడ రంగు మారిన నీరు రాకుండా తగు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది వేసవి తాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో త్రాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో నీటి సరఫరా లో ఎటువంటి లోపాలు. అంతరాయం రాకుండా తగు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు.