జిల్లాలో ”స్వీప్’ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి
1 min readకలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను తిలకించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం జిల్లాకు విచ్చేసిన సీఈఓ ఏలూరు కలెక్టరేట్ లో జిల్లాలో ఓటుహక్కుపై ఓటర్ల అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటర్లను చైతన్య పరిచేందుకు ‘స్వీప్ ‘ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలనీ ఆయన సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వివరిస్తూ జిల్లాలో పోలింగ్ శాతం పెంచే విధంగా, ఏథికల్ ఓటింగ్ జరపాలని 40 రోజులుగా 1756 కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే అనేక వర్గాల వారిని సమావేశ పర్చి అవగాహన సదస్సులు, మానవహారాలు, ర్యాలీలు, ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి మరియు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. ‘అమ్మ పిలుస్తుంది’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దూరప్రాంతంలో ఉన్న ఓటర్లకు జిల్లా యంత్రంగం నుంచి ఆహ్వాన పత్రిక పంపి పోలింగ్ రోజు ఓటర్లను పిలిపించి వోటింగులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ చెప్పడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఆహ్వాన పత్రికతో పాటు ఓటర్ల స్లిప్స్ కూడా పంపించమని సూచించారు. జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై , పోలింగ్ శాతం పెంచడానికి చేస్తున్న స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ని ముకేశ్ కుమార్ మీనా కీప్ ఇట్ అప్ అని ప్రత్యేకంగా అభినందించారు. వీరి వెంట వీరి వెంట జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి,జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐ టి డి ఏ పీఓ ఎం. సూర్యతేజ, అసిస్టెంట్ కలెక్టర్ టి. శ్రీపూజ, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్ . ఎస్.కె. ఖాజావలి, వై. భవాని శంకరి ,కె. అడ్డయ్య, ఎస్డీసీ ఎం. ముక్కంటి, కె. భాస్కర్, కలెక్టరేట్ ఏ వో కాశీ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.