PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

19న సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కృష్ణగిరి మండలం లక్కసాగరం  పంప్ హౌస్ నుండి 77 చెరువులకు నీరు అందించే పథకాన్ని  ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్   ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్  కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుగా హెలిప్యాడ్ వద్ధ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ హెలిప్యాడ్ వద్ధ లెవెలింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అదే విధంగా హెలిప్యాడ్ నుండి వేదిక స్థలం వరుకు రెండు ప్రక్కల  బ్యారికేడింగ్ చేయించాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని అదేశించారు.హెలిప్యాడ్ నుండి వేదిక స్థలం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు కి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి సూచించారు. హెలిప్యాడ్, వేదిక స్థలం వద్ధ  ఏర్పాటు చేయాల్సిన టెంట్స్, మొబైల్ టాయ్లెట్స్ ,  అదే విధంగా త్రాగునీటి సరఫరా కి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుండి వేదిక ప్రాంతానికి  వచ్చే మార్గంలో రోడ్ లెవెలింగ్ పనులు వెంటనే  పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ ఎస్ఈ ని అదేశించారు. అదే విధంగా రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని, రోడ్డు వెడల్పు కూడా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పైలాన్ ప్రారంభించే ప్రదేశములో రోడ్డు మార్గం లెవెలింగ్ చేయించాలని, చుట్టూ డబుల్ బ్యారికేడింగ్ వేయించాలని, ప్రజలకు ఎండ తగలకుండా షామియానా వేయించాలన్నారు.. పంప్ హౌజ్ భవనాన్ని పరిశీలిస్తూ పవర్ సప్లైస్, మోటర్ కెపాసిటీ, డిస్చార్జ్ కెపాసిటీ యొక్క వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అధికారులందరూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, ఇంఛార్జి ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author