PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక  ప్రాధాన్యత ఇస్తోంది

1 min read

– గత మూడు సంవత్సరాల్లో విద్య రంగంపై 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం

– దేశంలో ఎక్కడ లేని విధంగా నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే సొంతం

– విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలి.:-

– ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్

పల్లెవెలుగు వెబ్  ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గత మూడు సంవత్సరాల్లో విద్య రంగంపై 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేపట్టారని అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే సొంతం అని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.శనివారం ఆదోని పట్టణంలోని లేబర్ కాలనీ  ఆర్ .ఆర్ ఉన్నత పాఠశాలను, క్రాంతి నగర్ లోని సంతన్నపేట ప్రైమరీ స్కూల్ ను, ఎస్కేడి కాలనీలోని బాలికల కళాశాలను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాలలో ఉన్న పాఠ్యoశాలను నిర్దేశిత సమయంలో చెప్తున్నార, విద్యార్థులకు  క్లాస్ వర్క్ ఏ విధంగా చేయిస్తున్నారని పరిశీలించడం జరిగిందని, ఉపాధ్యాయులు చెప్తున్న పాఠాలను విద్యార్థులు క్లాస్ వర్క్ లో రాయడం లేదని, విద్యార్థులు క్లాస్ వర్క్ వ్రాసే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుందని ఉపాధ్యాయులు వారి బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని వారి యొక్క పని తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ అసహనం వ్యక్తం చేశారు.. ఉపాధ్యాయులు అందరూ నిర్దేశిత సమయంలో పాఠాలను విద్యార్థులకు బోధించాలని అదే విధంగా మీరు చెప్పిన పాఠాలను విద్యార్థులు వారి క్లాస్ వర్క్ లో వ్రాసే విధంగా చూడాలని వారు ఎదైనా తప్పులు వ్రాస్తే వాటిని కరెక్షన్స్ చేసి విద్యార్థులకు మరల వాటి గురించి వివరించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. .. విద్యకు సంబంధించి 6 నుండి 10 వ తరగతి అనేది విద్యకు ఒక పునాది రాయి లాంటిదని ఉపాధ్యాయులు విద్యార్థులను మన ఇంట్లో ఉండే పిల్లల లాగ భావించి వారి యొక్క విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్ కే డి కాలనీలోని ప్రభుత్వ బాలికల కళాశాలను తనిఖీ చేయగా ప్రతి తరగతి గదులను అలాగే నాడు నేడు ద్వారా అదనపు గదులు నిర్మాణం అవుతున్న వాటిని పరిశీలించారు ఇందులో భాగంగా ముందుగా విద్యార్థులకు బెంచెస్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. టాయిలెట్స్ పరిశీలించగా, నీళ్లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు నాడు నేడు ద్వారా మంజూరైన నిధులను ముందుగా విద్యార్థులకు అవసరమైన బెంచెస్, మరియు టాయిలెట్స్ కు అవసరమైన ప్లంబింగ్ నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలను నిరంతరం పర్యవేక్షణ చేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్  ఆదేశించారు.Gross Enrolment Ratio (GER) సర్వేను తనిఖీ. పట్టణంలోని వెంకన్న బావి కాలనీలో వాలంటీర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా జరుగుతున్న స్థూల నమోదు నిష్పత్తి (GER) Gross Enrolment Ratio సర్వేను తనిఖీ చేశారు. యొక్క సర్వే ద్వారా వాలంటీర్ పరిధిలో ఉండే ఇంటిలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యాభ్యాసం సంబంధించిన సర్వేను GER యాప్ లో నమోదు చేయాలి ఎవరైనా విద్యార్థి డ్రాప్ అవుట్ విద్యార్థిగా ఉంటే వారిని ఆ విద్యార్థిని కలిసి ఎందుకు పాఠశాలలకు రావడం లేదు వివరాలు తెలుసుకొని చదువు యొక్క ప్రాధాన్యతను ఆ విద్యార్థికి తెలియజేసి తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్ విద్యార్థులకు మరియు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా రీ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని మరియు ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి విద్యా దీవెన పథకాలకు కూడా అర్హత ఉంటుందని విద్యార్థులకు తెలియజేసి వారిని బడికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.పాల్గొన్న ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ,జేడీ వెంకటకృష్ణ రెడ్డి, డిఇఓ రంగా రెడ్డి, బాలికల జిసిడీఓ  సునీత, పిఓ ఎస్ ఎస్ ఈ (సర్వ శిక్ష అభియాన్ )ప్రాజెక్టు అధికారి వేణుగోపాల్, ఏ. డి. శామ్యూల్ పాల్ ,ఎంఈఓ శివరాములు, తదితరులు పాల్గొన్నారు.

About Author