దద్దమ్మ వల్ల రాష్ట్రం పరువు పోయింది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒంగోలు టీడీపీ మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చేతకాని దద్దమ్మ వల్ల రాష్ట్రం పరువు పోయిందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతారని చెప్పారు. “ రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రోడ్డు మీదకు రండి… మీకు అండగా మేము ఉంటాం. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే మన పోరాటం. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్ అన్నీ పెంచేశారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రోడ్లపైకి రండి.